మా ప్రపంచంలోకి రండి | shraddha kapoor sahoo look launch | Sakshi
Sakshi News home page

మా ప్రపంచంలోకి రండి

Jun 11 2019 3:02 AM | Updated on Jun 11 2019 3:02 AM

shraddha kapoor sahoo look launch - Sakshi

శ్రద్ధా కపూర్‌

సాహో ప్రపంచం ఎలా ఉండబోతోందో చూపించడానికి మేం రెడీ అయ్యాం అంటోంది చిత్రబృందం. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ను ఈనెల 13న రిలీజ్‌ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. సినిమాలోని శ్రద్ధా కపూర్‌ లుక్‌ను విడుదల చేశారు. షూటింగ్‌ చివరిదశలో ఉన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్, అరుణ్‌ విజయ్, ఎవలిన్‌ శర్మ, లాల్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 15న రిలీజ్‌ కానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement