సాహో మూవీ డబ్బింగ్‌కు సిద్ధమైన శ్రద్ధాకపూర్‌ | shraddha kapoor dubbing for the saaho movie | Sakshi
Sakshi News home page

సాహో మూవీ డబ్బింగ్‌కు సిద్ధమైన శ్రద్ధాకపూర్‌

Nov 27 2017 6:20 PM | Updated on Jul 17 2019 9:52 AM

shraddha kapoor dubbing for the saaho movie - Sakshi

తమిళసినిమా: సినిమా ఒక కాలక్షేప మాధ్యమమే. అలాగని అల్లాటప్పాగా చేసేస్తే ప్రేక్షకులు ఏ మాత్రం హర్షించరు. సినిమా ఎల్లలు దాటుతున్న కాలం ఇది. కొత్తదనంతో పాటు, పర్ఫెక‌్షన్‌ చాలా ముఖ్యం. తారలు చెప్పింది చేసేసి పోదాం, సాంకేతిక వర్గం చుట్టేసిపోదాం అనుకోవడంలేదు. ముందు తరం తారలు తమ పాత్రలకు తామే డబ్బింగ్‌ చెప్పి, పాటలు పాడుకునే వారు. ఆ తరువాత అది కొరవడుతూ వచ్చింది. పరభాషా తారల ప్రాబల్యం పెరగడం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. మాతృభాషలో కూడా డబ్బింగ్‌ చెప్పుకోలేని కథానాయికలు ఉన్నారంటే అతి శయోక్తి కాదు. అలాంటిది ఇటీవల పరభాషా యువ నటీమణులు కూడా తమ పాత్రలకు తామే డబ్బింగ్‌ చెప్పుకోవడానికి ఆసక్తి చూపుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. 

అలా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడానికి సిద్ధం అవుతున్న బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌. ఈ ముద్దుగుమ్మ త్రిభాషా చిత్రం సాహోలో కథానాయకిగా నటిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి -2 చిత్రం తరువాత ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రం ఇది.  ఈ చిత్రానికి శ్రద్ధాకపూర్‌ తెలుగు, తమిళం భాషల్లో సంభాషణలు చెప్పడానికి ప్రత్యేకంగా ఒక ట్యూటర్‌ను నియమించుకుందట.  డైలాగ్స్‌ పలకడంతో ఆయన నుంచి శిక్షణ పొంది చిత్ర సన్నివేశాల్లో నటిస్తోందట. అంతటితో ఆగకుండా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడానికి ముందుగానే సంభాషణల పేపర్లను తెప్పించుకుని ఇప్పటి నుంచే తర్ఫీదు పొందుతోందట. అదే విధంగా మరో మలయాళీ బ్యూటీ కీర్తీసురేశ్‌ కూడా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడానికి ఆసక్తి చూపుతోంది. ఈ అమ్మడిప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌లలో స్టార్‌ హీరోలతో నటిస్తూ చాలా బిజీగా ఉంది. తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా నటిస్తున్న తాజా చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పేసిందట. ఈ విషయాన్ని తను డబ్బింగ్‌ చెబుతన్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి మరీ చెప్పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement