గుజరాత్ ప్రచారానికి అమితాబ్ ఫొటో షూట్ | Shoojit Sircar shoots with Amitabh Bachchan in Gujarat | Sakshi
Sakshi News home page

గుజరాత్ ప్రచారానికి అమితాబ్ ఫొటో షూట్

Jan 27 2014 12:23 PM | Updated on Aug 21 2018 2:39 PM

గుజరాత్ ప్రచారానికి అమితాబ్ ఫొటో షూట్ - Sakshi

గుజరాత్ ప్రచారానికి అమితాబ్ ఫొటో షూట్

గుజరాత్ రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే కృషిలో భాగంగా ఆ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ అయిన అమితాబ్ బచ్చన్.. ఆ రాష్ట్ర అటవీ ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు.

గుజరాత్ రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే కృషిలో భాగంగా ఆ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ అయిన అమితాబ్ బచ్చన్.. ఆ రాష్ట్ర అటవీ ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు షూజిత్ సర్కార్ ఈ షూటింగుకు దర్శకత్వం వహిస్తున్నారు. గుజరాత్లోని అడవులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలలో వన్యప్రాణుల సంరక్షణ మీద ప్రధానంగా ఈ ప్రకటనలో దృష్టి సారించనున్నారు. ''అక్కడున్న వివిధ పక్షులు, జంతువుల ఫొటోలు తీసుకోడానికి నేను, బచ్చన్ సాబ్ కలిసి తిరుగుతున్నాం. కచ్ ప్రాంతంలోని రణ్ అడవులలో గల అడవి గాడిదలు చాలా ప్రముఖమైనవి. వాటిని మా కెమెరాలలో బంధించేందుకు వెళ్తున్నాం. వాటితో పాటు కృష్ణజింకలు, అనేక జాతులకు చెందిన పక్షుల ఫొటోలు కూడా తీసుకుంటాం.

మీకు తెలుసా, ప్రతియేటా శీతాకాలంలో ఇక్కడకు అనేక జాతులకు చెందిన పక్షులు వలస వస్తాయి. మళ్లీ సీజన్ అయిపోగానే అవి వాటి స్వస్థలాలకు వెళ్లిపోతాయి. వాటిని కూడా కెమెరాలలో బంధిస్తున్నాం. ఇక్కడ చాలా అద్భుతమైన వన్యప్రాణులున్నాయి'' అని షూజిత్ సర్కార్ తెలిపారు. కనీసం ప్రాథమిక సదుపాయాలు కూడా ఏమీ లేని ప్రాంతాల్లోకి బిగ్ బీ, సర్కార్ వెళ్లి ఫొటోలు తీసుకుంటున్నారు. జనవరి చివరి వారంలో గుజరాత్లో గడపడం అంటే చాలా కష్టమని, తానుఅమితాబ్ కలిసి ఇక్కడి వన్యప్రాణులను గాలిస్తామని,  క్రియేటివ్ కన్సల్టెంటు పీయూష్ పాండే కూడా మాతో ఉంటారని కూడా సర్కార్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement