ఫ్యాన్‌కి ఫోన్‌

shivakumar mobile gift her fan - Sakshi

ప్రముఖ నటులు శివకుమార్‌ (హీరోలు సూర్య, కార్తీల తండ్రి) ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు రాహుల్‌ అనే ఓ అభిమాని సెల్ఫీ తీసుకోబోయాడు. దీంతో అతని ఫోన్‌ను శివకుమార్‌ విసిరేయడం చర్చనీయాంశమైంది. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన ఆ తర్వాత వీడియో సందేశం ఇచ్చారు. అది రాహుల్‌కి నచ్చలేదు. ‘‘శివకుమార్‌ చాలా గొప్ప నటుడే కావచ్చు. కానీ ఆయన అలా ప్రవర్తిస్తారని ఊహించలేదు. ఆయన నన్ను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పలేదు. నా లైఫ్‌లో ఇకపై ఏ సెలబ్రిటీతోనూ సెల్ఫీ దిగను. ఇది నాకో గుణపాఠం’’ అని రాహుల్‌ ఓ పోస్ట్‌ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై శివకుమార్‌ మరోసారి స్పందిస్తూ ‘‘నేను చేసింది తప్పని ఇప్పటికీ మీకు అనిపిస్తే నన్ను క్షమించండి. నేను అలా చేసి ఉండకూడదు’’ అన్నారు. ఆ తర్వాత రాహుల్‌కి రూ.21 వేల ఖరీదైన స్మార్ట్‌ ఫోన్‌ను కొనిచ్చారు శివకుమార్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top