రెండు హృదయాల ప్రయాణం | Shiva 143 Trailer Launch By Director VV Vinayak | Sakshi
Sakshi News home page

రెండు హృదయాల ప్రయాణం

Nov 26 2019 6:13 AM | Updated on Nov 26 2019 6:13 AM

Shiva 143 Trailer Launch By Director VV Vinayak - Sakshi

రామసత్యనారాయణ, వీవీ వినాయక్‌

శైలేష్, ఏయిషా అదరహా జంటగా నటించిన చిత్రం ‘శివ 143’. ది జర్నీ ఆఫ్‌ టు హార్ట్స్‌ ట్యాగ్‌లైన్‌. రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రంలో హీరోగా నటించి, దర్శకత్వం వహించారు శైలేష్‌. ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు వీవీ వినాయక్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘చిన్న చిత్రాలు నిర్మించటంలో రామ సత్యనారాయణది అందె వేసిన చేయి. సినిమాను ప్రేక్షకుల దగ్గరికి ఎలా తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు’’ అన్నారు. ‘‘వినాయక్‌గారు విడుదల చేసిన మా ‘రహస్యం’ చిత్రం విజయం సాధించింది. ఇప్పుడు ఆయన ట్రైలర్‌ విడుదల చేసిన మా ‘శివ 143’  కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు రామసత్యనారాయణ . ‘‘నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ ఇచ్చినందుకు రామసత్యనారాయణ గారికి థ్యాంక్స్‌. జనవరి 12న ఈ సినిమాను విడుదల
చేస్తాం’’ అన్నారు హీరో, దర్శకుడు శైలేష్‌.

Advertisement
 
Advertisement
Advertisement