పడి పడి లేచే మనసు.. మ్యాజిక్‌ ఆఫ్‌ లవ్‌

Sharwanand Sai Pallavi Padi Padi Leche Manasu Trailer - Sakshi

విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శర్వానంద్‌ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పడి పడి లేచే మనసు. కోల్‌కత బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయ్యింది. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచిన చిత్రయూనిట్‌ టైలర్‌ను రిలీజ్‌ చేశారు. ట్రైలర్‌ చూస్తే సినిమా హను రాఘవపూడి మార్క్‌ అందమైన ప్రేమకథగా తెరకెక్కిన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో మరోసారి సాయి పల్లవి ఫిదా చేసేందుకు రెడీ అవుతోంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్‌ 21న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top