దేవుడు మనతోనే ఉంటాడు | sharabha movie press meet | Sakshi
Sakshi News home page

దేవుడు మనతోనే ఉంటాడు

Dec 19 2017 12:14 AM | Updated on Dec 19 2017 12:14 AM

sharabha movie press meet - Sakshi

‘ఫైర్‌ ఉన్న నాలాంటి కుర్రాడితో పెట్టుకోకు..బాడీ మార్చురీలో ఉంటుంది. దేవుడికే దెయ్యం పట్టిస్తే సృష్టి సర్వనాశనం అవుతుంది. వెళ్లేదారి మంచిదైతే దేవుడు కూడా మనతో వస్తాడు. గమ్యం చేరేదాకా ఆయన మనతోనే ఉంటాడు’ వంటి డైలాగ్స్‌ ‘శరభ’ చిత్రంపై ఆసక్తి పెంచుతున్నాయి. ఆకాష్‌ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా రూపొందిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌ ‘శరభ’. జయప్రద, నెపోలియన్, నాజర్‌ కీలక పాత్రల్లో నటించారు. ఎన్‌.నరసింహారావు దర్శకత్వంలో ఏ.కె.ఎస్‌. ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై అశ్వనీకుమార్‌ సహదేవ్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయనున్నారు.

అశ్వనీకుమార్‌ సహదేవ్‌ మాట్లాడుతూ– ‘‘మంచి కథ, కథనాలతో నరసింహారావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్‌ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ చేసిన ప్రోస్థటిక్‌ మేకప్, సీజీ వర్క్‌ ప్రత్యేక ఆకర్షణలు. చిరంజీవిగారు ఆవిష్కరించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి, ‘దిల్‌’ రాజుగారు రిలీజ్‌ చేసిన టీజర్‌కి భారీ స్పందన లభించింది. కోటిగారి సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. ఒక కొత్త  డైరెక్టర్, కొత్త హీరో కాంబినేషన్‌లో రూపొందిన మా చిత్రం హిందీ శాటిలైట్‌ రైట్స్‌ భారీ రేటుకు అమ్ముడుపోవడం విశేషం’’ అన్నారు. పునీత్‌ ఇస్సార్, తనికెళ్ల, ఎల్‌.బి.శ్రీరామ్, సాయాజీ షిండే, పృధ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రమణ సాల్వ.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement