ఈ షకీలా వేరు! | Shakeela Film Sheelavathi Aug 17th Release | Sakshi
Sakshi News home page

ఈ షకీలా వేరు!

Aug 3 2018 5:13 AM | Updated on Aug 3 2018 5:13 AM

Shakeela Film Sheelavathi Aug 17th Release - Sakshi

షకీలా

సెన్సేషనల్‌ స్టార్‌ షకీలా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘శీలవతి’. సాయిరామ్‌ దాసరి దర్శకత్వంలో జీ స్టూడియోస్‌ సమర్పణలో రాఘవ ఎమ్‌. మహేశ్, వీరు బాసింశెట్టి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు ముగిశాయి. ఈ నెల 17న  సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు.  షకీలా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం నాకు చాలా స్పెషల్‌. ఇది నా కెరీర్‌లో 250వ చిత్రం. నెక్ట్స్‌ సీన్‌ ఏంటి? అనే ఉత్కంఠతను రేకెత్తించేలా దర్శకుడు తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘సెన్సార్‌ ట్రబుల్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఎదుర్కొని సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యాం. కేరళలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కించాం. ఈ సినిమా చూశాక ఇంతకుముందు షకీలా వేరు ఈ సినిమా తర్వాత షకీలా వేరు అని ప్రేక్షకులు అంటారు. సాయిరామ్‌ బాగా తెరకెక్కించారు’’ అన్నారు నిర్మాతలు. అర్జున్, గీతాంజలి, అశోక్, కొండ, తిరుపతి, చిన్నా తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రజ్వల్‌ క్రిష్‌ సంగీతం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement