సందేశంతో షకీలా సినిమా | Shakeela Come Up with romantic target | Sakshi
Sakshi News home page

సందేశంతో షకీలా సినిమా

Oct 12 2014 11:21 PM | Updated on Sep 2 2017 2:44 PM

సందేశంతో షకీలా సినిమా

సందేశంతో షకీలా సినిమా

నటిగా దక్షిణ, ఉత్తరాది భాషల్లో దాదాపు 250 చిత్రాల్లో నటించిన షకీలా దర్శకురాలిగా మారి, చేసిన చిత్రం ‘రొమాంటిక్ టార్గెట్’. నరేష్, శ్వేతా శైన్, శ్రీదేవి ముఖ్య తారలుగా సయ్యద్ అఫ్జల్ సమర్పణలో

 నటిగా దక్షిణ, ఉత్తరాది భాషల్లో దాదాపు 250 చిత్రాల్లో నటించిన షకీలా దర్శకురాలిగా మారి, చేసిన చిత్రం ‘రొమాంటిక్ టార్గెట్’. నరేష్, శ్వేతా శైన్, శ్రీదేవి ముఖ్య తారలుగా  సయ్యద్ అఫ్జల్ సమర్పణలో మెంటా సత్యనారాయణ ఈ చిత్రం నిర్మించారు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ - ‘‘ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలను, అన్యాయాలను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రం చేశాం. తమను తాము కాపాడుకోవడానికి అవసరమైతే ఆడవాళ్లు మహాశక్తిగా మారాలని చెప్పే చిత్రమిది. యాక్షన్, క్రైమ్, రొమాన్స్, సస్పెన్స్, వినోదాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ద్వారా మంచి సందేశం కూడా ఇస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: సాయి, నండూరి వీరేష్, కెమెరా: కంకణాల శ్రీనివాసరెడ్డి, సంగీతం: కార్తీక్, అభిషేక్, సహనిర్మాత: జల్లెపల్లి నరేష్, సమర్పణ: సయ్యద్ అఫ్జల్.
 

Advertisement
 
Advertisement
Advertisement