ఫస్ట్‌ లుక్‌: అల్లుడు-కూతురితో శైలజారెడ్డి | Shailaja Reddy Alludu First Look Released | Sakshi
Sakshi News home page

Jul 9 2018 12:32 PM | Updated on Sep 27 2018 8:49 PM

Shailaja Reddy Alludu First Look Released - Sakshi

శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్‌ లుక్‌

అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అత్త పాత్రలో సీనియర్‌ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ ను రిలీజ్‌ చేశారు. పోస్టర్‌లో నాగచైతన్య డిఫరెంట్‌ లుక్‌ ఆకట్టుకునేలా ఉంది.  చైతూ సరసన అనూ ఇమ‍్మాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా గోపీసుందర్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న శైలజారెడ్డి అల్లుడుని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు డైరెక్టర్‌ మారుతి యత్నిస్తున్నాడు.  మరోవైపు చైతూ నటిస్తున్న సవ్యసాచి చిత్ర షూటింగ్‌ కూడా శరవేగంగా జరుపుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement