రెండోసారి తండ్రైన షాహీద్‌ కపూర్‌ | Shahid Kapoor Blessed With A Baby Boy | Sakshi
Sakshi News home page

రెండోసారి తండ్రైన షాహీద్‌ కపూర్‌

Sep 6 2018 8:52 AM | Updated on Sep 6 2018 9:27 AM

Shahid Kapoor Blessed With A Baby Boy - Sakshi

నా స్నేహితురాలు మీరా రాజ్‌పుత్‌కి కుమారుడు జన్మించాడు. తనకు నా శుభాకాంక్షలు..

బాలీవుడ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ షాహీద్‌ కపూర్‌ ఇంట ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. ప్రస్తుతం షాహీద్‌ ఇంటికి అభిమానులు, స్నేహితులు నుంచి అభినందనలు వరుసకడుతున్నాయి. విషయం ఏంటో ఈ పాటికే మీకు అర్థమయ్యి ఉంటుంది.. అవును షాహీద్‌ కపూర్‌ మరోసారి తండ్రయ్యాడు. షాహీద్‌ కపూర్‌ - మీరా రాజ్‌పుత్‌ల ఇంటికి ఓ చిన్ని రాకుమారుడు వచ్చాడు. బుధవారం సాయంత్రం ముంబైలోని హిందుజా ఆస్పత్రిలో మీరా రాజ్‌పుత్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మీరా రాజ్‌పుత్‌ ప్రాణ స్నేహితురాలు ప్రగ్యా యాదవ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశారు.

‘నా స్నేహితురాలు మీరా రాజ్‌పుత్‌కి కుమారుడు జన్మించాడు. తనకు నా శుభాకాంక్షలు.. ఈ సంతోషకరమైన విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకున్నాను’ అంటూ ప్రగ్యా యాదవ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఇది తెలిసిన వెంటనే అలియా భట్‌ తన స్నేహితుడు, సహ నటుడు అయిన షాహీద్‌ కపూర్‌కి అభినందనలు తెలిపారు. అలియా ‘షాన్‌దార్‌’, ‘ఉడ్తా పంజాబ్‌’ వంటి చిత్రాల్లో షాహీద్‌ కపూర్‌ సరసన నటించిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్ర మీరా రాజ్‌పూత్‌ని హిందూజ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ వెంటనే షాహీద్‌ కపూర్‌, మీరా రాజ్‌పుత్‌ల తల్లులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

ఆల్రెడీ షాహిద్, మీరా దంపతులకు మిషా అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షాహీర్‌ కపూర్‌ తెలుగు ‘అర్జున్‌ రెడ్డి’ హిందీ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌ 21న విడుదల కానున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement