‘ఇన్నేళ్ల తరువాత ఒప్పుకుంది’ | Shah Rukh Khans Adorable Selfie With Wife | Sakshi
Sakshi News home page

Jul 8 2018 10:02 AM | Updated on Jul 8 2018 10:59 AM

Shah Rukh Khans Adorable Selfie With Wife - Sakshi

మరో ఆసక్తికర ఫోటోను ట్వీట్‌ చేశాడు షారూఖ్‌. తన భార్య గౌరీఖాన్‌తో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసిన షారూఖ్‌ ‘ఇన్నేళ్ల తరువాత నేను తీసిన ఫోటోను పోస్ట్‌ చేసేందుకు ఒప్పుకుంది’ అంటూ కామెంట్‌ చేశారు.

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కుటుంబంతో కలిసి యూరప్‌ టూర్‌లో ఉన్నారు. టూర్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు తన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంటున్నారు షారూఖ్‌. ఇటీవలలో ఆర్యన్‌, అబ్‌రామ్‌లు దిగిన ఫోటో, స్పెయిన్‌లో సుహానా దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

తాజాగా మరో ఆసక్తికర ఫోటోను ట్వీట్‌ చేశాడు షారూఖ్‌. తన భార్య గౌరీఖాన్‌తో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసిన షారూఖ్‌ ‘ఇన్నేళ్ల తరువాత నేను తీసిన ఫోటోను పోస్ట్‌ చేసేందుకు ఒప్పుకుంది’ అంటూ కామెంట్‌ చేశారు. జీరో షూటింగ్ పూర్తి చేసిన షారూఖ్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హాలీడేస్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement