షారుక్...ఇక డిస్ట్రిబ్యూటర్! | Shah Rukh Khan to turn distributor with 'Dilwale'? | Sakshi
Sakshi News home page

షారుక్...ఇక డిస్ట్రిబ్యూటర్!

Jul 28 2015 12:07 AM | Updated on Sep 3 2017 6:16 AM

షారుక్...ఇక డిస్ట్రిబ్యూటర్!

షారుక్...ఇక డిస్ట్రిబ్యూటర్!

షారుక్ ఖాన్ అంటే ఓ స్టార్ హీరోగానే కాదు... సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా అని అందరికీ తెలుసు. దేశ విదేశాల్లో విస్తరించిన అతని వ్యాపార సామ్రాజ్యం

షారుక్ ఖాన్ అంటే ఓ స్టార్ హీరోగానే కాదు... సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా అని అందరికీ తెలుసు. దేశ విదేశాల్లో విస్తరించిన అతని వ్యాపార సామ్రాజ్యం చూసి ఓ సర్వే సంస్థ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల జాబితాలో అతనికి రెండో స్థానం కూడా ఇచ్చేసింది. తాజా వార్త ఏంటంటే...  షారుక్ ఖాన్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టనున్నారట. ‘దిల్‌వాలే’ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న షారుక్ ఖాన్ ఈ చిత్రాన్ని  పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిస్సా, రాజస్థాన్‌లలో ఉన్న ఎగ్జిబి టర్లకు ‘దిల్‌వాలే’ చిత్రాన్ని అమ్మేశారని, ఏకంగా రూ.280 కోట్ల బిజినెస్ జరిగిందని బోగట్టా.
 

Advertisement
 
Advertisement
Advertisement