షారుక్ ఆస్తి ఎంతో తెలుసా..? | Shah Rukh Khan net Worth: $600 Million / ₹39,791,970,000 | Sakshi
Sakshi News home page

షారుక్ ఆస్తి ఎంతో తెలుసా..?

May 6 2016 9:17 AM | Updated on Apr 3 2019 6:34 PM

షారుక్ ఆస్తి ఎంతో తెలుసా..? - Sakshi

షారుక్ ఆస్తి ఎంతో తెలుసా..?

షారుక్ ఖాన్.. ఒక్క బాలీవుడ్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న నటుడు.

ముంబయి: షారుక్ ఖాన్.. ఒక్క బాలీవుడ్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న నటుడు. ఒక్కసారి ఆయనకు సంబంధించిన సంక్షిప్త సమాచారం పరిశీలిస్తే.. షారుక్‌ ఖాన్ తల్లి దండ్రులు తాజ్ మహ్మద్ ఖాన్, తల్లి లతీఫ్ ఫాతిమా. 1965లో షారుక్ న్యూఢిల్లీలో జన్మించాడు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. తొలుత సెయింట్ కొలంబియా పాఠశాలలో చదివిన షారుక్ అనంతరం ఢిల్లీలోనే హన్స్ రాజ్ కాలేజీలో, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో చదివాడు. అనంతరం 1991లో గౌరీని వివాహం చేసుకున్నాడు.

ఎకనామిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చేయడంతోపాటు.. కమ్యునికేషన్, ఫిల్మ్ మేకింగ్ లో మాస్టర్ పూర్తి చేసిన షారుక్ తొలిసారి 1989తో ఓ టీవీ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చారు. ఫౌజీ అనే టీవీ సీరిస్ కార్యక్రమంలో కనిపించారు. ఆయన నటించిన తొలిసినిమా దీవానా 1992లో విడుదలైంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నెగెటివ్ రోల్స్ కూడా చేశారు. అందులో ఓ సైకో క్యారెక్టర్ కూడా ఉంది. అలా ప్రస్తానం మొదలుపెట్టిన షారుక్ ఇక తిరిగి వెనక్కి చూసుకోలేదు. ప్రస్తుతం ఆయనకు ముగ్గురు పిల్లలు. వారిలో ఒక పాప ఉంది. ఇంత ప్రస్తానం ఉన్న షారుక్ ఆస్తి విలువ ఎంతో తెలుసా.. దాదాపు 600 మిలియన్ డాలర్లు. అనగా, రూ.39,791,970,000. ప్రపంచ నటుల్లో అత్యధిక సంపన్నుల జాబితాలో షారుక్ది రెండో స్థానం. అందుకే షారుక్ బాలీవుడ్ లో రిచెస్ట్ యాక్టర్ అయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement