శివాజీరాజాకు గుండెపోటు | Senior Actor Shivaji Raja Suffers Heart Attack Nothing Serious | Sakshi
Sakshi News home page

శివాజీరాజాకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు

May 6 2020 8:16 AM | Updated on May 6 2020 8:16 AM

Senior Actor Shivaji Raja Suffers Heart Attack Nothing Serious - Sakshi

సీనియర్‌ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) మాజీ అధ్యక్షడు శివాజీరాజా గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక స్టార్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా బీపీ లెవల్స్‌ పడిపోవడంతోనే శివాజీ రాజాకు గుండెపోటు వచ్చినట్లు డాక్టర్లు తెలిపారని ఆయన సన్నిహితులు వివరించారు. 

అంతేకాకుండా ఆయనకు స్టంట్‌ వేయాలని డాక్టర్లు సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో 24 గంటల పాటు వైద్యుల ప్రత్యేక పరిశీలనలో ఉంటారని పేర్కొన్నారు. ఇక శివాజీ రాజా గుండెపోటుకు గురయ్యారనే వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొంటున్నారు. 400కు పైగా సినిమాల్లో నటించిన ఆయన కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే, టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. 

చదవండి:
రాణీ ప్రియాంక
పారితోషికంలో పాతిక కట్‌

Advertisement
 
Advertisement
Advertisement