తోట బావి వద్ద...

Sekhar Master Launches Thota Bavi Movie First look - Sakshi

యాంకర్‌ రవి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తోట బావి’. గౌతమి హీరోయిన్‌గా నటించారు. అంజి దేవండ్ల దర్శకత్వం వహించారు. గద్వాల్‌ కింగ్స్‌ సమర్పణలో జోగులాంబ క్రియేషన్స్‌ పతాకంపై ఆలూర్‌ ప్రకాష్‌ గౌడ్‌  నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని డ్యాన్స్‌ మాస్టర్‌ శేఖర్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘తోటబావి’ టైటిల్‌ చాలా కొత్తగా ఉంది. ఫస్ట్‌లుక్‌ బావుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి, యూనిట్‌కి పేరు తీసుకురావాలి’’ అన్నారు. అంజి దేవండ్ల మాట్లాడుతూ– ‘‘యాక్షన్, థ్రిల్లర్‌ నేపథ్యంలో కొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది.

రవిగారు ఇచ్చిన సపోర్ట్‌తో సినిమాను బాగా తీయగలిగాం. క్వాలిటీ విషయంలో నిర్మాతలు రాజీపడలేదు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘కథ, కథనాలను దర్శకుడు చాలా ఆసక్తిగా రాసుకుని, అదే తరహాలో సినిమా రూపొందించాడు. సెప్టెంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు ఆలూర్‌ ప్రకాష్‌ గౌడ్‌. ‘‘టైటిల్‌ లాగే సినిమా కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది’’ అన్నారు రవి. శివశంకర్‌ మాస్టర్, ఈ చిత్రానికి కెమెరా: చిడతల నవీన్, సంగీతం: దిలీప్‌ బండారి, సహనిర్మాతలు: దౌలు (విష్ణుప్రియ హోటల్‌), చిన్న స్వామి, అభినేష్‌ .బి.
 ∙గౌతమి, రవి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top