మాస్ హీరోతో హాట్ బ్యూటి | seerath Kapoor in raviteja touch chesi chudu | Sakshi
Sakshi News home page

మాస్ హీరోతో హాట్ బ్యూటి

May 3 2017 1:24 PM | Updated on Sep 5 2017 10:19 AM

మాస్ హీరోతో హాట్ బ్యూటి

మాస్ హీరోతో హాట్ బ్యూటి

లాంగ్ గ్యాప్ తరువాత మాస్ మహరాజ్ రవితేజ, రెండు సినిమాలను ఒకేసారి లైన్లో పెట్టాడు. ఇప్పటికే అనీల్ రావిపూడి

లాంగ్ గ్యాప్ తరువాత మాస్ మహరాజ్ రవితేజ, రెండు సినిమాలను ఒకేసారి లైన్లో పెట్టాడు. ఇప్పటికే అనీల్ రావిపూడి డైరెక్షన్లో రాజా ది గ్రేట్ షూటింగ్లో బిజీగా ఉన్న రవితేజ, మరో సినిమా టచ్ చేసి చూడు కూడా సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా రాశీఖన్నాను ఫిక్స్ చేయగా తాజాగా సెకండ్ హీరోయిన్ను కూడా ఫైనల్ చేశారు.

రన్ రాజా రన్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటి సీరత్ కపూర్. తొలి సినిమాతో సక్సెస్ సాధించినా తరువాత ఆ ఫాంను కొనసాగించలేకపోయింది సీరత్. దీంతో ఇన్నాళ్లు ఫోటో షూట్లతో కాలం గడిపేసిన ఈ బ్యూటి, ఇప్పడిప్పుడే బిజీ అవుతోంది. ఇప్పటికే రాజుగారి గది 2లో నాగ్ సరసన నటిస్తున్న సీరత్ కపూర్, తాజాగా రవితేజ సరసన సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.

Advertisement
 
Advertisement
Advertisement