సరికొత్త స్క్రీన్‌ప్లే | Screenplay Movie Press Meet | Sakshi
Sakshi News home page

సరికొత్త స్క్రీన్‌ప్లే

Mar 2 2020 5:12 AM | Updated on Mar 2 2020 5:12 AM

Screenplay Movie Press Meet - Sakshi

ప్రగతి

విక్రమ్‌ శివ, ప్రగతి హీరోహీరోయిన్లుగా ‘స్క్రిప్ట్‌ డాక్టర్‌గా ప్రసిద్ధిపొందిన కెఎల్‌ ప్రసాద్‌ నటించి దర్శకత్వం వహించిన చిత్రం ‘స్క్రీన్‌ప్లే’. ‘ఆఫ్‌ ఏన్‌ ఇండియన్‌ లవ్‌స్టోరీ’ అన్నది క్యాప్షన్‌. డాక్టర్‌ అరుణకుమారి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని పలువురు సినీ విమర్శకులకు, రచయితలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విక్రమ్‌ శివ, ప్రగతి, సంగీత దర్శకురాలు యంయంశ్రీలేఖ, కెఎల్‌ ప్రసాద్‌ మాట్లాడారు. ‘‘పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో మా సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. నటీనటుల నటన, సినిమా స్క్రీన్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement