లండన్ నుంచి ఇండియాకు వచ్చి... | Sathyam Vaipu Margamu Movie Stills | Sakshi
Sakshi News home page

లండన్ నుంచి ఇండియాకు వచ్చి...

Mar 6 2015 11:31 PM | Updated on Sep 2 2017 10:24 PM

లండన్ నుంచి ఇండియాకు వచ్చి...

లండన్ నుంచి ఇండియాకు వచ్చి...

వినయ్, భావన, లేఖా వాషింగ్టన్ ముఖ్య తారలుగా రూపొందిన తమిళ చిత్రం ‘జయమ్ కొండాన్’, తెలుగులోకి ‘మార్గం’ పేరుతో అనువాదమైంది.

వినయ్, భావన, లేఖా వాషింగ్టన్ ముఖ్య తారలుగా రూపొందిన తమిళ చిత్రం ‘జయమ్ కొండాన్’, తెలుగులోకి ‘మార్గం’ పేరుతో అనువాదమైంది. సత్యదేవా పిక్చర్స్ పతాకంపై ఆర్. సత్యనారాయణ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను ఆర్. సత్యనారాయణ చెబుతూ -‘‘ఈ నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నాం. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం అనువాద హక్కులు దక్కించుకోవడానికి చాలామంది నిర్మాతలు పోటీ పడ్డారు.

చివరకు మాకు దక్కడం ఆనందంగా ఉంది. లండన్‌లో హాయిగా ఉద్యోగం చేసుకుంటున్న ఓ యువకుడు, ఇండియా వచ్చి అనుకోని సంఘటనలో ఇరుక్కుంటాడు. దాన్నుంచి ఎలా బయటపడ్డాడు? తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకున్నాడు? అనేది ఈ చిత్రం కథాంశం. విద్యాసాగర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయబోతున్నాం. ఆర్. కన్నన్ దర్శకత్వం, వినయ్, భావనల నటన ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement