మాలీవుడ్లో బన్నీ రికార్డ్ | Sarrainodu Malayalam Highest 50 Days | Sakshi
Sakshi News home page

మాలీవుడ్లో బన్నీ రికార్డ్

Jul 17 2016 12:44 PM | Updated on Sep 4 2017 5:07 AM

మాలీవుడ్లో బన్నీ రికార్డ్

మాలీవుడ్లో బన్నీ రికార్డ్

ఇన్నాళ్లు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన మన తెలుగు హీరోలు ఇప్పుడు ఇతర ఇండస్ట్రీల మీద కూడా దృష్టి పెడున్నారు. ఈ లిస్ట్ అందరికన్నా ముందున్న స్టార్ హీరో స్టైలిష్ స్టార్...

ఇన్నాళ్లు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన మన తెలుగు హీరోలు ఇప్పుడు ఇతర ఇండస్ట్రీల మీద కూడా దృష్టి పెడున్నారు. ఈ లిస్ట్ అందరికన్నా ముందున్న స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మాలీవుడ్లో మల్లు అర్జున్గా ఫేమస్ అయిన బన్నీ తన సినిమాలతో అక్కడ కూడా భారీ వసూళ్లనే సాధిస్తున్నాడు. ఇప్పటికే మరే తెలుగు హీరోకి సాధ్యం కానీ ఫాలోయింగ్ సాధించిన బన్నీ, తన తాజా చిత్రం సరైనోడుతో మరో రికార్డ్ సృష్టించాడు.

డివైడ్ టాక్తో స్టార్ట్ అయిన సరైనోడు సినిమాను టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లిస్ట్లో నిలబెట్టిన బన్నీ, మాలీవుడ్లో కూడా అదే ఫీట్ను రిపీట్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో 115 సెంటర్లలో 50 రోజులు ఆడిన ఈ సినిమా మాలీవుడ్లో 24 సెంటర్లలో 50 రోజులు ప్రదర్శింపబడింది. కేరళలో 20కి పైగా సెంటర్లలో 50 రోజులు పాటు ప్రదర్శింపబడిన తొలి తెలుగు సినిమా ఇదే కావటం విశేషం. తనకు ఇంతటి ఘనవిజయాన్ని అందించిన మళయాల ప్రేక్షకులను స్వయంగా కలిసేందుకు త్వరలో కేరళ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు బన్నీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement