‘ఆన్‌లైన్‌లో అత్యధిక మంది చూసిన సినిమా’ | Sarrainodu Hindi Dubbed Version Becomes The Most Watched Indian Film On YouTube | Sakshi
Sakshi News home page

Mar 21 2018 12:34 PM | Updated on Mar 21 2018 12:34 PM

Sarrainodu Hindi Dubbed Version Becomes The Most Watched Indian Film On YouTube - Sakshi

అల్లు అర్జున్ హీరోగా మాస్‌ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరైనోడు. అల్లు అర్జున్‌ కెరీర్‌లో బిగెస్ట్‌ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా తరువాత ఆన్‌లైన్‌లోనూ అదే జోరు చూపిస్తుంది. ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ వర్షన్ కు యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్‌లు నమోదు చేస్తోంది. ఇప్పటికే ఈసినిమాను ఆన్‌లైన్‌లో 146 మిలియన్లకు పైగా ప్రేక్షకులు వీక్షించారు.

త్వరలో 150 మిలియన్ల మార్క్‌ను అందుకునేందుకు పరుగులు పెడుతున్న ఈ సినిమా ఆన్‌లైన్‌లో అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షించిన భారతీయ చిత్రంగా రికార్డ్‌ సృష్టించింది. అల్లు అర్జున్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ వర్షన్‌ ను  2017 మే 28న గోల్డ్‌ మైన్స్‌ టెలిఫిలింస్‌ సంస్థ తమ యూట్యూబ్‌ చానల్‌ లో పోస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement