సర్థార్ గబ్బర్సింగ్ విడుదల వాయిదా..? | sardaar gabbar singhs release to be delayed | Sakshi
Sakshi News home page

సర్థార్ గబ్బర్సింగ్ విడుదల వాయిదా..?

Mar 10 2016 8:39 AM | Updated on Oct 30 2018 5:58 PM

సర్థార్ గబ్బర్సింగ్ విడుదల వాయిదా..? - Sakshi

సర్థార్ గబ్బర్సింగ్ విడుదల వాయిదా..?

ప్రస్తుతం టాలీవుడ్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా సర్థార్ గబ్బర్సింగ్. లాంగ్ గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోలోగా హీరోగా చేస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ను...

ప్రస్తుతం టాలీవుడ్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా సర్థార్ గబ్బర్సింగ్. లాంగ్ గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోలోగా హీరోగా చేస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ను సమ్మర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. చిత్ర నిర్మాత శరత్ మరార్ కూడా పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అనుకున్నట్టుగా సర్థార్ గబ్బర్సింగ్ సినిమాను ఏప్రిల్ 8న రిలీజ్ చేయటం సాధ్యం అయ్యేలా కనిపించటం లేదు. ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు పెండింగ్లోనే ఉంది. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందన్న విషయంపై కూడా క్లారిటీ లేదు. దీంతో అనుకున్న సమయానికి గబ్బర్ సింగ్ అభిమానుల ముందుకు రావటం కష్టంగానే కనిపిస్తోంది.

యూనిట్ సభ్యులు ఇంత వరకు ప్రమోషన్ను ప్రారంభించకపోవటం కూడా అనుమానాలకు తావిస్తోంది. రిలీజ్కు ఇంకా నెల సమయం కూడా లేకపోవటం, ఇప్పటి వరకు ఆడియో రిలీజ్ డేట్ కూడా ఫైనల్ కాకపోవటంతో సర్థార్ రిలీజ్ వాయిదా పడ్డట్టే అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి ఇప్పటికైన యూనిట్ సభ్యులు ఈ విషయంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement