ఈ ఫోటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా..? | Sakshi
Sakshi News home page

ఈ ఫోటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా..?

Published Thu, Sep 5 2019 12:14 PM

Sara Ali Khan Shares A Chubby Look Pic With Her Mom Amrita Singh - Sakshi

ఈ ఫోటోలో ఉన్న నటిని గుర్తు పట్టారా..? స్టార్ వారసులిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించిన బ్యూటీ ఈమె. ఆమె ఎవరో కాదు, సైఫ్ అలీఖాన్‌ ముద్దుల తనయ సారా అలీఖాన్‌. సినీ ప్రముఖుల వారసులు ఇండస్ట్రీలోకి వచ్చేందుకు తమని తాము ఎంతో మార్చుకుంటారు. అలా సారా అలీఖాన్‌ కూడా తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్న తరువాతే తెరంగేట్రం చేశారు.

గత ఏడాది రిలీజ్‌ అయిన కేథార్‌నాథ్, సింబా సినిమాలతో ఆకట్టుకున్న సారా ప్రస్తుతం కూలీ నెంబర్‌ 1తో పాటు ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఓ ఫోటోను షేర్‌ చేశారు. ఆ ఫోటోతో పాటు ‘నన్ను ఎవరూ విసిరేయలేని రోజుల్లోని ఫోటో’ అంటూ కామెంట్‌ చేశారు. తల్లి అమృతా సింగ్‌తో కలిసి దిగిన ఈ ఫోటోలో సారాను చూసి అభిమానులు షాక్‌ అవుతున్నారు. భారీకాయంతో ఉన్న సారాను ఈ ఫోటోలో గుర్తుపట్టడం కూడా కష్టమే. ఇండస్ట్రీలోకి రాక ముందు సారా 90 కేజీలకు పైగా బరువు ఉండేవారు.
ఒబెసిటీ కారణంగా ఆమె ఆరోగ్యసమస్యలను కూడా ఎదుర్కొన్నారు. అయితే హీరోయిన్‌గా ప్రూవ్‌ చేసుకోవాలన్న పట్టుదలతో సరైన ఆహార నియమాలు పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ నాజుగ్గా రెడీ అయ్యారు. తన పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సారా షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Advertisement
 
Advertisement