‘సంత’ సక్సెస్‌ కావాలి

Santha movie First Look Poster Launch by Sukumar - Sakshi

సుకుమార్‌

‘‘గ్రామీణ నేపథ్యంలో చక్కని ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా తీసిన చిత్రం ‘సంత’. గోరేటి వెంకన్నగారు ఓ లెజెండ్‌. ఆయన ఈ సినిమాకి రాసిన పాట అద్భుతంగా ఉంది. ప్రేక్షకులకు నచ్చే అంశాలున్న ‘సంత’ సక్సెస్‌ కావాలి. చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌’’ అని దర్శకుడు సుకుమార్‌ అన్నారు. సూర్య భరత్‌చంద్ర, శ్రావ్యారావు జంటగా నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంత’. ‘మట్టి మనుషుల ప్రేమకథ’ అన్నది ట్యాగ్‌ లైన్‌.

శ్రీ జై వర్ధన్‌ బోయెనేపల్లి నిర్మించి న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని ‘రంగస్థలం’ సెట్‌లో సుకుమార్‌ విడుదల చేశారు.ప్రవీణ్‌ చందర్‌ మాట్లాడుతూ– ‘‘ఓ సంత నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ జోనర్‌లో ఉంటుంది. హైదరాబాద్, వరంగల్‌ పరిసర ప్రాంతాల్లో పాటలు చిత్రీకరించాం. షూటింగ్‌ పూర్తయింది. త్వరలో పాటలు విడుదల చేస్తాం’’ అన్నారు. కిన్నెర, మధుమణి, ఫణి, ప్రసన్న, ఆర్‌.ఎస్‌.నందా, దుర్గేష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఫణీంద్ర వర్మ అల్లూరి, కథ– కథనం– సంగీతం– దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top