ఆ హీరో కెరీర్‌లోనే అతిపెద్ద రిలీజ్‌

Sanju To Be The Widest Release For Ranbir Kapoor - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌ దత్‌ జీవితం ఆధారంగా ‘సంజు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజ్‌ కుమార్‌ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ పాత్రలో చాక్లెట్‌ బాయ్‌ రణబీర్‌ కపూర్‌ నటించాడు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి.

సినిమా రిలీజ్‌ ను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌. రాజ్‌ కుమార్‌ హిరానీ ట్రాక్‌ రికార్డ్ తో పాటు సంజయ్‌దత్‌ బయోపిక్‌ కావటంతో సంజు అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనూ సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తోంది. అందుకు తగ్గట్టుగా దాదాపుగా 4000 స్క్రీన్స్‌లో సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. కేవలం ఒక్క భాషలో రిలీజ్‌ అయ్యే సినిమాను ఇన్ని స్క్రీన్స్‌ లో రిలీజ్‌ చేయటం కూడా ఓ రికార్డే. అంతేకాదు రణబీర్‌ కపూర్‌ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్‌ కావటం విశేషం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top