ఆ హీరో సంపాదన.. రూ. 450 | Sanjay Dutt to walk out of Yerwada Jail with Rs 450 | Sakshi
Sakshi News home page

ఆ హీరో సంపాదన.. రూ. 450

Feb 24 2016 11:40 AM | Updated on Sep 3 2017 6:20 PM

ఆ హీరో సంపాదన.. రూ. 450

ఆ హీరో సంపాదన.. రూ. 450

పుణె ఎరవాడ జైలు నుంచి గురువారం విడుదల కానున్న సంజయ్ దత్కు జైలు అధికారులు 450 రూపాయలు అందజేయనున్నారు.

పుణె ఎరవాడ జైలు నుంచి గురువారం విడుదల కానున్న సంజయ్ దత్కు జైలు అధికారులు 450 రూపాయలు అందజేయనున్నారు. ఇన్నాళ్లు ఖైదీగా జైల్లో పేపర్ బ్యాగులు తయారు చేసిన సంజయ్, రోజుకు 50 రూపాయల చొప్పున రూ. 38,000 వరకు సంపాదించాడు. అయితే జైల్లో తన అవసరాల నిమిత్తం చాలావరకు ఖర్చు చేయటంతో విడుదల సమయంలో కేవలం రూ. 450 మాత్రం అతని చేతికి రానున్నాయి.

1993లో జరిగిన ముంబై పేలుళ్ల కేసులో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణల నేపథ్యంలో సంజయ్ దత్ శిక్ష అనుభవించాడు. 2013లో సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పునివ్వగా అప్పటికే 18 నెలల శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నాడు. మిగతా కాలాన్ని కూడా పూర్తిచేసుకున్న సంజయ్.. ఈ గురువారం విడుదలవుతున్నాడు. సంజయ్ దత్‌ను లీడ్ రోల్‌లో తీసుకుని పలు చిత్రాలు నిర్మించడానికి బాలీవుడ్ సినీ పరిశ్రమ సమాయత్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement