సంజయ్కు 30 రోజుల పెరోల్! | Sanjay Dutt gets 30-day parole for daughter's "nose surgery" | Sakshi
Sakshi News home page

సంజయ్కు 30 రోజుల పెరోల్!

Aug 26 2015 10:54 AM | Updated on Sep 3 2017 8:10 AM

సంజయ్కు 30 రోజుల పెరోల్!

సంజయ్కు 30 రోజుల పెరోల్!

అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో దోషిగా యేర్వాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు మరోసారి పెరోల్ మంజూరైంది.

ముంబయి: అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో దోషిగా యేర్వాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు మరోసారి పెరోల్ మంజూరైంది. దత్‌కు ఇప్పటివరకు మూడుసార్లు పెరోల్ మంజూరుకాగా.. మరోసారి కూడా ఇచ్చారు. సంజయ్ కుమార్తె ముక్కుకు శస్త్ర చికిత్స చేయనున్న నేపథ్యంలో ఆమె మంచి చెడులు చూసుకునే ఉద్దేశంతో పెట్టుకున్న పెరోల్ బెయిల్కు తాజాగా కోర్టు అనుమతించింది. 30 రోజులపాటు సంజయ్ దత్ పెరోల్పై జైలు వెలుపల ఉండనున్నారు.

దత్ 1993లో ముంబయిలో జరిగిన సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో ఖైదీగా ఉన్నారు. ఆయనకు తరుచూ పెరోల్ మంజూరు చేయడాన్ని నిరసిస్తూ గతంలో కొందరు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇలాగే ఆయనకు పెరోల్ ఇచ్చుకుంటూ వెళితే ఇతర ఖైదీలు కూడా పెరోల్ మంజూరుచేయాలని డిమాండ్ చేసే ప్రమాదం ఉందని ఆ పిల్లో హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement