ఎండాకాలంలో ఇలానే ఉండాలి : హీరో కూతురు

Sanjay Dutt Daughter Trishala Dutt Post A Swimsuit Photo Became Viral - Sakshi

ముంబై: సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే సంజయ్‌ దత్‌ కూతురు త్రిషాల దత్‌ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫొటో ఒకటి కుర్రకారు గుండెల్లో వేడి రాజేస్తోంది. ‘ఎండాకాలం వచ్చే వరకు ఆగలేను’ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్‌ కూడా ఇచ్చారు ఈ అమ్మడు. ‘సమ్మర్‌లో ఉల్లాసంగా, ఉత్సాహంగా, అంతకుముందు కంటే కాస్త అందంగా కనిపించొచ్చు, అందుకే ఇక వేచి ఉండలేను’ అంటూ తన ఫాలోవర్లతో షేర్ చేసుకున్నారు త్రిషాల.

ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షల మంది ఫాలోవర్లు కలిగిన త్రిషాల తన ఫ్యాన్స్‌తో ఎప్పడూ అప్‌డేటెడ్‌గా ఉంటారు. దుబాయ్‌లో తన కుటుంబంతో కలిసి విహార యాత్రలో ఉన్న ఆమె స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద బికినీలో దిగిన ఈ ఫొటోలో మరింత అందంగా పోజులిచ్చారు. ఆమె తన అందంతో అభిమానులను కట్టిపడేశారు. త్రిషాల పోస్టు చేసిన ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

కాగా, సంజయ్‌ దత్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘సంజు’ చిత్రం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో సంజయ్‌ పాత్రను రణబీర్‌ కపూర్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లో రణబీర్‌ అచ్చం సంజయ్‌దత్‌ లాగానే ఉండడంతో ‘సంజు’ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. త్రిషాల దత్‌ సంజయ్‌ మొదటి భార్య రిచా శర్మ కూతురన్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top