ఒక్క మనిషిలో ఎన్ని కోణాలో... | Sanjay Dutt Biopic Sanju Movie Teaser Out | Sakshi
Sakshi News home page

Apr 24 2018 1:52 PM | Updated on Apr 24 2018 3:34 PM

Sanjay Dutt Biopic Sanju Movie Teaser Out - Sakshi

సంజు చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ (ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌)

సాక్షి, ముంబై ; బాలీవుడ్‌లో మరో బయోపిక్‌ వచ్చేస్తోంది. సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌ జీవితగాథను సంజు పేరుతో దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ(మున్నాభాయ్‌, త్రీ ఇడియట్స్‌, పీకే ఫేమ్‌) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ మరియు టీజర్‌లు కాసేపటి క్రితం విడుదల అయ్యాయి. యంగ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ లీడ్‌ రోల్‌ చేస్తుండగా.. అనుష్క, సోనమ్‌ కపూర్‌, మనీషా కోయిరాల, పరేష్‌ రావెల్‌ తదితరులు కీలక పా​త్రల్లో కనిపించబోతున్నారు.  

టీజర్‌ విషయానికొస్తే.. సంజు బాబాకు లుక్కులో రణ్‌బీర్‌ ఆకట్టుకున్నాడు. తొలినాళ్ల నుంచి ఇప్పటిదాకా సీనియర్‌ నటుడు జీవితంలో ఎదుర్కున్న పరిస్థితులను మొత్తం చూపించేశారు. సినీ కెరీర్‌ మొదలు.. వ్యక్తిగత జీవితం, డ్రగ్స్‌ అలవాట్లు, జైలు జీవితం తదితర అంశాలను చూపించేశారు. ఇక ఆయా దశల్లో సంజయ్‌లా కనిపించటం కోసం రణ్‌బీర్‌.. బాడీ, బాడీ లాంగ్వేజ్‌ల విషయంలో బాగానే కష్టపడ్డట్లు అర్థమౌతోంది. ఫన్నీగా మొదలై చివరికి సీరియస్‌గా టీజర్‌ను ముగించేశారు. వినోద్‌ చోప్రా ఫిలింస్‌, ఆర్‌హెచ్‌ఎఫ్‌-ఫాక్స్‌ స్టార్‌ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్న సంజు చిత్రం జూన్‌ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.   

Advertisement
 
Advertisement
Advertisement