శృతి తప్పుకోవటంపై సంఘమిత్ర టీం క్లారిటీ | Sangamithra team Clarification | Sakshi
Sakshi News home page

శృతి తప్పుకోవటంపై సంఘమిత్ర టీం క్లారిటీ

May 31 2017 2:29 PM | Updated on Sep 5 2017 12:28 PM

శృతి తప్పుకోవటంపై సంఘమిత్ర టీం క్లారిటీ

శృతి తప్పుకోవటంపై సంఘమిత్ర టీం క్లారిటీ

బాహుబలి రిలీజ్ తరువాత అంతకన్న భారీగా తెరకెక్కుతున్న సౌత్ సినిమాగా భారీ ప్రచారం పొందిన సినిమా సంఘమిత్ర.

బాహుబలి రిలీజ్ తరువాత అంతకన్న భారీగా తెరకెక్కుతున్న సౌత్ సినిమాగా భారీ ప్రచారం పొందిన సినిమా సంఘమిత్ర. తమిళ దర్శకుడు సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇటీవం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఘనంగా లాంచ్ చేశారు. ప్రధాన పాత్రల్లో శృతిహాసన్, జయం రవి, ఆర్యలు నటిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే ఈ సినిమాపై వివాదాలు మొదలయ్యాయి.

సంఘమిత్ర కోసం విదేశాల్లో కత్తి యుద్థాలు సైతం నేర్చుకున్న శృతిహాసన్ సడన్గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది. నిర్మాతలు సరిగా కమ్యూనికేట్ చేయటం లేదన్న కారణంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది శృతి. అయితే దర్శకుడు సుందర్.సి వచ్చిన విభేదాల కారణంగానే శృతిహాసన్ సంఘమిత్ర నుంచి తప్పుకుందన్న టాక్ కోలీవుడ్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్ శృతి తప్పుకోవడానికి దర్శకుడు కారణం కాదంటూ క్లారిటీ ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement