సమంత హిందూమతానికి మారిందా? | sanabtha converted into hindhu? | Sakshi
Sakshi News home page

సమంత హిందూమతానికి మారిందా?

Oct 1 2016 3:37 AM | Updated on Sep 4 2017 3:39 PM

సమంత హిందూమతానికి మారిందా?

సమంత హిందూమతానికి మారిందా?

నటి సమంత హిందుమతానికి మారారా? ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్న న్యూస్ ఇదే.దక్షిణాదిలో అగ్రకథానాయకిగా రాణిస్తున్న సమంత ఇటీవల తమిళ, తెలుగు భాషాచిత్రాలన్నీ

నటి సమంత హిందుమతానికి మారారా? ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్న న్యూస్ ఇదే.దక్షిణాదిలో అగ్రకథానాయకిగా రాణిస్తున్న సమంత ఇటీవల తమిళ, తెలుగు భాషాచిత్రాలన్నీ  మంచి విజయాన్ని సాధించి ఈ ముద్దుగుమ్మ స్టార్ ఇమేజ్‌ను మరింత పెంచాయని చెప్పవచ్చు. అయితే సమంత అవకాశాలను మాత్రం తగ్గించుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు కారణం కల్యాణ గడియలు దగ్గర పడుతుండడమే అనే టాక్ వినిపిస్తోంది. సమంత, టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య గాఢంగా ప్రేమలో మునిగితేలుతున్నారన్న ప్రచారం మీడియాలో చాలా కాలంగా హెడ్‌లైన్‌లో హాట్ న్యూస్‌గా ప్రచారం జరుగుతున్న విషయం విదితమే.
 
 కాగా వచ్చే ఏడాది తమ వివాహం జరగనుందన్న విషయాన్ని నాగచైతన్య ఇటీవల చెన్నైకి వచ్చిన సందర్భంగా తెలిపారు కూడా. అయితే నాగచైతన్య హిందూ మతానికి చెందగా నటి సమంతది క్రిస్టియన్ కుటుంబం. దీంతో వీరి పెళ్లి రెండు మతాల సంప్రదాయం ప్రకారం రెండు సార్లు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో నటి సమంత ఇటీవల హిందూ మతాన్ని స్వీకరించినట్లు మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement