వారం పాటు మొబైల్ వాడకుండా స్టార్ హీరోయిన్ | Samantha Spent a Week Without a mobile | Sakshi
Sakshi News home page

వారం పాటు మొబైల్ వాడకుండా స్టార్ హీరోయిన్

Jun 27 2017 1:17 PM | Updated on Sep 5 2017 2:36 PM

వారం పాటు మొబైల్ వాడకుండా స్టార్ హీరోయిన్

వారం పాటు మొబైల్ వాడకుండా స్టార్ హీరోయిన్

ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం 1985 షూటింగ్ లో బిజీగా ఉన్న సమంత సినిమా కోసం

ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం 1985 షూటింగ్ లో బిజీగా ఉన్న సమంత సినిమా కోసం చాలా త్యాగాలు చేస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ రంపచోడవరం అటవీ ప్రాంతంలో జరిగింది. కనీస వసతులు కూడా లేని ఈ ప్రాంతంలో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేశారు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా రామ్ చరణ్, సమంతలు ఎలాంటి కంప్లైంట్ చేయకుండా షూటింగ్ చేశారు.

షూటింగ్ లొకేషన్ లో సమంత స్టిల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా షూటింగ్ కు సంబంధించి సమంత చేసిన ట్వీట్ మరింత ఆసక్తికరంగా మారింది. 'వారం పాటు ఫోన్ లేకుండా.. అంత ఇబ్బందిగా లేదు.. నేను మరోసారి కూడా ఇలా ఉండగలను..?' అంటూ ట్వీట్ చేసింది. తెలుగు తమిళ భాషల్లో ఫుల్ బిజీగా ఉన్న సమంత అక్టోబర్ లో నాగచైతన్నతో పెళ్లికి రెడీ అవుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement