‘పెద్ద సాహసం చేయడానిక బయలుదేరాం’

Samantha Shares Photo With Naga Chaitanya - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీవితంలో ఎప్పుడూ సాహసాలు చేయాలనేది టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత కల అని ఆమె తరచూ చెబుతూ ఉంటారు. ఇక లాక్‌డౌన్‌ తన కలలను నెరవేర్చుకునే బాట పట్టారు సమంత. ఎందుకంటే లాక్‌డౌన్‌ల్‌ బయటకు వెళ్లడం, నిత్యవసర సరుకులు కొనుగోలు చేయడం అనేది కూడా ప్రస్తుతం సాహసంతో కూడుకున్న పని అయిపోయింది. కాగా తన భర్త, హీరో నాగచైతన్య అక్కినేనితో కలిసి ఇంట్లోకి నిత్యవసర సరుకులు కొనుగోలు చేసేందుకుకు  బైక్‌పై శుక్రవారం బయటకు వెళ్లే సాహసం చేశారు. (మరింత మంచి నటి అవుతా!)

🍞

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

పిలియన్‌ బైక్‌పై ఇద్దరూ కలిసి బయటకు వెళ్లిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇందులో చైతూ బైక్‌ నడుపుతుంటే సమంత సామాన్ల బ్యాగు వెనకాల ధరించి ఉన్న ఈ ఫొటోను బ్రెడ్‌ ఎమోజీని క్యాప్షన్‌గా జత చేసి షేర్‌ చేశారు. ఇక గురువారం కారులో తన భర్త చైతూతో కలిసి షికారుకు వెళుతున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘మేము ఓ పెద్ద సాహసం చేయడానికి బయలుదేరాము’’ అంటూ షేర్‌ చేశారు. ఇక లాక్‌డౌన్‌లో‌ ఇంట్లో తమ పెంపుడు కుక్క హాష్‌తో, చైతూతో కలిసి సందడి చేస్తున్న ఫొటోలను తరచూ అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top