ఆ బుడ్డోడిని కిడ్నాప్‌ చేస్తా : సమంత | Samantha Impressed With A Boy Dance On Rangamma Song | Sakshi
Sakshi News home page

ఆ బుడ్డోడిని కిడ్నాప్‌ చేస్తా : సమంత

Jun 8 2018 3:47 PM | Updated on Jun 8 2018 4:17 PM

Samantha Impressed With A Boy Dance On Rangamma Song - Sakshi

రంగస్థలం సినిమా ఎంత హిట్టయిందో అందులోని పాటలు కూడా అంతే హిట్టయ్యాయి. ముఖ్యంగా ‘రంగమ్మ మంగమ్మ’ సాంగ్‌ అయితే జనాల్లోకి బాగా దూసుకెళ్లింది. ఈ పాటపై ఎన్నో స్ఫూప్‌లు వచ్చాయి. నటుడు ఉత్తేజ్‌ కూతురు కూడా మెగా హీరో రామ్‌చరణ్‌ నటనను పొగుడుతూ రంగమ్మ మంగమ్మ పాటను పేరడీ చేశారు. తాజాగా ఈ పాట మరోసారి వార్తల్లో నిలిచింది.

షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా హీరోయిన్‌ సమంత సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. గతంలో ఓ తాత, రంగమ్మ మంగమ్మ పాటను పాడాడు.  అది సమంతకు నచ్చడంతో.. ఆమె ‘మేడ్‌ మై డే’ అంటూ ట్వీట్‌ చేశారు. తాజాగా ఓ బుడతడు రంగమ్మ పాటకు చేసిన డ్యాన్స్‌  సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోను సమంత అభిమాని ఒకరు ఆమెకు ట్యాగ్‌ చేయగా.. సమంత సరదాగా స్పందించారు. ‘ఆ చిన్నారి బాలుడిని కిడ్నాప్‌ చేస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement