96 రీమేక్‌కు టైటిల్‌ ఫిక్స్‌!

Samantha And Sharwanand Ready For 96 Telugu Remake - Sakshi

కోలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన డిఫరెంట్ మూవీ 96. విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా కూడా మంచి విజయం సాధించటంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్‌ చేస్తున్నారు. ఇప్పటికే కన్నడ వర్షన్‌ రీమేక్‌ పనులు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతుండగా తెలుగు వర్షన్‌ త్వరలోనే పట్టాలెక్కనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈసినిమాలో సమంత, శర్వానంద్‌లు జంటగా నటించనున్నారు.

చాలా రోజుల క్రితమే రీమేక్‌ను ప్రకటించినా.. మార్పులు చేర్పుల చేయటంలో ఆలస్యం అయ్యింది. ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వం వహించిన ప్రేమ్‌కుమార్ తెలుగు రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారు. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘జాను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి దసరా లోపు రిలీజ్ చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top