హత్య చేసింది ఎవరు?

Samantha, Aadhi Pinisetty's first look from U Turn - Sakshi

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘యూ టర్న్‌’. కన్నడలో ఘన విజయం సాధించిన ‘యూ టర్న్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. మాతృకకు దర్శకత్వం వహిస్తున్న పవన్‌ కుమార్‌ ఈ సినిమాకి దర్శకుడు. ఆది పినిశెట్టి, భూమిక చావ్లా, రాహుల్‌ రవీంద్రన్‌ ముఖ్య పాత్రల్లో ఈ చిత్రాన్ని  శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్, వీవై కంబైన్స్‌ పతాకాలపై శ్రీనివాస్‌ చిత్తూరి, రాంబాబు బండారు నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి ఫస్ట్‌ లుక్‌ని శుక్రవారం విడుదల చేశారు.

నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఓ హత్య మిస్టరీని చేధించే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో ఆది నటిస్తున్నారు. సమంత ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ పాత్రలో కనిపిస్తారు. ఇటీవల విడుదల చేసిన సమంత ఫస్ట్‌ లుక్‌కి ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్‌ షూటింగ్‌ చివరి దశకు వచ్చింది. ఆ తర్వాత పాటలు చిత్రీకరించనున్నాం. సెప్టెంబర్‌ 13న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి, కెమెరా: నికేత్‌ బొమ్మి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top