గోవాలో టాప్ హీరో సందడి | Sakshi
Sakshi News home page

గోవాలో టాప్ హీరో సందడి

Published Mon, Oct 31 2016 11:35 AM

గోవాలో టాప్ హీరో సందడి

ముంబై: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ గోవాలో ప్రత్యక్షమయ్యాడు. దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి గోవాలో జరుపుకున్నాడు. తన వారందరితో కలిసి పండుగ చేసుకున్నాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న 'ట్యూబ్ లైట్' సినిమా షూటింగ్ కు విరామం ఇచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గోవాలో వాలిపోయాడు ఈ కండలవీరుడు. సముద్రపు ఒడ్డునున్న ప్రైవేటు రిసార్ట్‌ లో సల్మాన్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపాడు. ఆటపాటలతో సందడి చేశాడు.

బావ అతుల్ అగ్నిహోత్రి, సోదరుడు సోహైల్ భార్య సీమా, వారి కొడుకులు, సోదరి అర్పిత, ఆమె భర్త ఆయుష్ వీరి కుమారుడు ఆహిల్ తో కలిసి సల్మాన్ దీపావళి జరుపుకున్నాడు. ఈ ఫొటోలను సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ సోహల్ మీడియాలో పోస్ట్ చేశాడు. హీరో సూరజ్ పంచోలీ సహా కుర్రాళ్లతో కలిసి దిగిన మరో ఫొటోను సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్ పేజీలో పెట్టాడు. కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న ట్యూబ్ లైట్ సినిమాలో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన ఏక్ థా టైగర్, బజరంగీ భాయ్ జాన్ సినిమాలు ఘన విజయం సాధించాయి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement