చుల్‌బుల్‌పాండే రిటర్న్స్‌ | Salman Khan starts shooting for Dabangg 3 | Sakshi
Sakshi News home page

చుల్‌బుల్‌పాండే రిటర్న్స్‌

Apr 2 2019 6:28 AM | Updated on Apr 2 2019 6:28 AM

Salman Khan starts shooting for Dabangg 3 - Sakshi

చుల్‌బుల్‌పాండే.. విలన్లకే విలన్‌. సీరియస్‌గా కనిపించే సరదా పోలీస్‌. అందుకే బాలీవుడ్‌ సినిమాల్లో కనిపించిన పోలీసులకు ప్రత్యేకం చుల్‌బుల్‌. 2010లో ‘దబాంగ్‌’ సినిమాలో చుల్‌బుల్‌ పాండేగా కనిపించారు సల్మాన్‌ ఖాన్‌. ‘దబాంగ్‌’ చిత్రం బ్లాక్‌బస్టర్‌. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘దబాంగ్‌ 2’ కూడా హిట్టే. ఈ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో ఇన్‌స్టాల్‌మెంట్‌ ‘దబాంగ్‌ 3’ చిత్రం ఏప్రిల్‌ 1న ప్రారంభమైంది. సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఇండోర్‌లో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. ‘‘నేను, అన్నయ్య (అర్బాజ్‌ ఖాన్‌) ఇండోర్‌లోనేపుట్టాం. ‘దబాంగ్‌ 3’ చిత్రాన్ని ఇక్కడే మొదలుపెట్టడం సంతోషంగా ఉంది’’ అని సల్మాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. మొదటి రెండు భాగాల్లో హీరోయిన్‌గా కనిపించిన సోనాక్షి సిన్హా ఇందులోనూ హీరోయిన్‌గా కనిపిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement