సల్మాన్ బ్యానర్లో మరో వారసుడు | Salman Khan introducing sunil shetty son ahan shetty | Sakshi
Sakshi News home page

సల్మాన్ బ్యానర్లో మరో వారసుడు

Oct 16 2015 12:30 PM | Updated on Sep 3 2017 11:04 AM

సల్మాన్ బ్యానర్లో మరో వారసుడు

సల్మాన్ బ్యానర్లో మరో వారసుడు

బాలీవుడ్ న్యూ జనరేషన్కి సల్మాన్ ఖాన్ లాంచ్ ప్యాడ్లా మారుతున్నాడు. స్టార్ హీరోలు తమ వారసులను వెండితెరకు పరిచయం చేయడానికి సల్మాన్ అయితేనే కరెక్ట్ అని...

బాలీవుడ్ న్యూ జనరేషన్కి సల్మాన్ ఖాన్ లాంచ్ ప్యాడ్లా మారుతున్నాడు. స్టార్ హీరోలు తమ వారసులను వెండితెరకు పరిచయం చేయడానికి సల్మాన్ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు వారసులని పరిచయం చేసిన కండల వీరుడు త్వరలోనే మరో వారసుడిని వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు.

2010లో సల్మాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది శతృఘ్న సిన్హా తనయ సోనాక్షి సిన్హా. తొలి సినిమాతోనే సూపర్ హిట్ సాదించిన ఈ బ్యూటీ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. దీంతో సల్మాన్ ది గోల్డెన్ హ్యాండ్ అని ఫిక్స్ అయ్యారు అంతా. ఇటీవల 'హీరో' సినిమాతో ఆదిత్య పంచౌలి కొడుకు సూరజ్, సునీల్ శెట్టి కూతురు అతియాలను వెండితెరకు పరిచయం చేశాడు సల్మాన్. ఈ సినిమా టాక్ పరంగా నిరాశపరిచినా, మంచి వసూళ్లను రాబట్టి ఈ ఇద్దరు వారసులను కమర్షియల్గా నిలబెట్టింది.

తాజాగా మరో వారసుడిని పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాడు సల్మాన్ ఖాన్. సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టిని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ లాంటి విషయాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న అహాన్ త్వరలోనే సల్మాన్ సొంతం నిర్మాణ సంస్థ ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement