అల్లుడు వస్తున్నాడు | Sailaja Reddy Alludu Confirmed For August 31 | Sakshi
Sakshi News home page

అల్లుడు వస్తున్నాడు

Jul 6 2018 1:38 AM | Updated on Jul 6 2018 1:39 AM

Sailaja Reddy Alludu Confirmed For August 31 - Sakshi

నాగచైతన్య

అల్లుడు రాక కోసం సర్వం సిద్ధం చేశారు. మరి.. అల్లుడికి అత్తయ శైలజారెడ్డి ఎలాంటి సౌకర్యాలు,  ఏ స్థాయి స్వాగత మర్వాదలు చేశారనేది సిల్వర్‌ స్క్రీన్‌పై చూడాల్సిందే. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికగా నటిస్తున్నారు.

అత్తయ్య శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. గోపీసుందర్‌ స్వరాలు అందిస్తున్నారు. రీసెంట్‌గా నాగచైతన్య, అను, రమ్యకృష్ణలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నెల 9న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘శైలజా రెడ్డి అల్లుడు వస్తున్నాడు’’ అని పేర్కొన్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్‌ చేయనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement