సాయిరాం శంకర్ కొత్త సినిమా ప్రారంభం | Sai Shankar new movie begins | Sakshi
Sakshi News home page

సాయిరాం శంకర్ కొత్త సినిమా ప్రారంభం

Jul 2 2019 5:39 PM | Updated on Jul 2 2019 5:39 PM

Sai Shankar new movie begins - Sakshi

సాయిరాం శంకర్ హీరోగా కొత్త సినిమా మంగళవారం ప్రారంభమైంది.

సాయిరాం శంకర్ హీరోగా కొత్త సినిమా మంగళవారం ప్రారంభమైంది. తలుపులమ్మ దేవస్థానంలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా క్లాప్ కొట్టగా, నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో సాయిరాం శంకర్‌పై నూతన దర్శకుడు చిరుమామిళ్ల కృష్ణ తొలి సన్నివేశం చిత్రీకరించారు.

తాను ఇంతవరకు నటించిన చిత్రాల్లోనే ఇది విభిన్న కథా చిత్రం అవుతుందని హీరో సాయిరాం శంకర్ అన్నారు. తన కెరీర్‌లో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని, తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందని తెలిపారు. దర్శకుడు కృష్ణ మాట్లాడుతూ అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన క్రైమ్ సస్పెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకొని, ఆగష్టు నుండి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమృత హరిణి క్రియేషన్స్ సురేష్ రెడ్డి, రియల్ రీల్స్ రాజారెడ్డి, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement