ఏమో ఏదైనా జరగొచ్చు!

Sai Pallavi on working with Prabhudheva in Maari 2 - Sakshi

‘‘జీవితంలో అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరగకపోతే ఏం టెన్షన్‌ పడకండి. చేసిన పనిలో మన బెస్ట్‌ ఇచ్చామా? లేదా అన్నదే ముఖ్యం. ఏమో? ఎవరికి తెలుసు.. దొరకలేదనుకున్నది మరో రూపంలో సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లా మనకే తారసపడొచ్చు’’ అని సాయి పల్లవి అంటున్నారు. దానికి ఆమె ప్రయాణమే ఎగ్జాంపుల్‌. అది 2008.. చెన్నైలోని ఏవీయమ్‌ స్టూడియోస్‌. ‘ఉంగళిల్‌ యార్‌ ఆడుత్త ప్రభుదేవా’ (మీలో ఎవరు తర్వాతి ప్రభుదేవా?) అనే డ్యాన్స్‌ షో సెమీ ఫైనల్స్‌ నడుస్తున్నాయి. సాయి పల్లవి టీమ్‌ కూడా ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొంది. కానీ సెమీ ఫైనల్స్‌లోనే వెనక్కి తిరిగారు... నిరాశతో. కట్‌ చేస్తే.. 2018, ఏవీయమ్‌ స్టూడియోస్‌. ధనుష్‌తో సాయి పల్లవి చేస్తున్న ‘మారీ 2’లోని ‘రౌడీ బేబీ.. ’ సాంగ్‌ షూట్‌. షూటింగ్‌ స్పాట్‌కు వెళ్తుంటే తెలిసిన ప్రదేశంలానే తోచింది సాయి పల్లవికి.

యస్‌.. పదేళ్ల క్రితం డ్యాన్స్‌ షో చేయడానికి వచ్చింది. ఆ షో గెలిచి ఉంటే ప్రభుదేవాతో ఓ మొమెంటో అందుకునేదేమో పల్లవి. కానీ ఏకంగా ప్రభుదేవా మాస్టరే ఇప్పుడు ఆమెకు మూమెంట్స్‌ కంపోజ్‌ చేయడం విశేషం. అక్కడ చేజారిందనుకున్న అవకాశాన్ని కాలం రెట్టించి తిరిగిచ్చేసింది. అప్పుడు ఫెయిలైన సాయి పల్లవి ఈసారి సక్సెస్‌ అయింది. ‘బాగా డ్యాన్స్‌ చేశావ్‌’ అంటూ ప్రభుదేవా నుంచి అభినందనలు కూడా అందుకుంది. ఈ ఆనందాన్నే తాజాగా పంచుకున్నారు సాయి పల్లవి. ‘ఎప్పుడూ నీ బెస్ట్‌ ఇవ్వు. జీవితం ఏదో ఓ రూపంలో ఎప్పటికైనా ఆశీర్వదిస్తుంది’ అంటూ ప్రభుదేవాతో దిగిన ఫొటోను షేర్‌ చేశారు సాయి పల్లవి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top