మేకప్ వేసుకోకపోవడానికి కారణం అదే | sai pallavi talk about her makeup | Sakshi
Sakshi News home page

మేకప్ వేసుకోకపోవడానికి కారణం అదే

Mar 4 2018 8:34 PM | Updated on Aug 9 2018 7:30 PM

sai pallavi talk about her makeup - Sakshi

సాక్షి, సినిమా : నటి సాయిపల్లవి మలయాళ సినిమా ప్రేమమ్‌లో మలర్‌ టీచర్‌గా నటించి ఒక్క కేరళ ప్రేక్షకులనే కాకుండా తమిళనాడు, ఆంధ్ర ప్రేక్షకులను ఆకట్టుకుని తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత తెలుగులో ‘ఫిదా’తో యువతను ఫిదా చేశారు.  ఫిదా, ఎంసీఏ వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకుంది. సాయిపల్లవి దాదాపు మేకప్‌ లేకుండా నటించేందుకే ఇష్టపడుతుంటారు. ఆ విషయం ఆమె సినిమాలు చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది.

అందుకు గల కారణాలను ఆమె మీడియాతో పంచుకున్నారు. తన తొలి సినిమా ‘ప్రేమమ్‌’ దర్శకుడు ఆల్ఫోన్స్‌ ‌పుతెరిన్‌ ఆమెను సహజంగా నటించమని  ప్రోత్సహించినట్లు తెలిపారు. అలాగే తనతో కలిసి పనిచేసిన అందరు దర్శకులూ తన ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడ్డారని పేర్కొన్నారు. అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి కూడా ఇలా చేస్తున్నట్లు చెప్పారు. విజయ్‌ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా , సాయిపల్లవి కథానాయికగా నటించిన  ‘కణం’, సినిమా మార్చి 9న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ధనుష్‌కు జంటగా మారి-2, సూర్యతో సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement