చంటబ్బాయ్‌ ఇష్టం

Sai Dharam Tej Speech At Agent Sai Srinivasa Athreya Pre Release event - Sakshi

– సాయిధరమ్‌ తేజ్‌

నవీన్‌ పొలిశెట్టి, శృతీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’. స్వరూప్‌ ఆర్‌.ఎస్‌.జె. దర్శకత్వంలో రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించారు. రేపు విడుదల కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌లో అతిథిగా పాల్గొన్న సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘నవీన్‌ నటించిన వీడియోలు కొన్ని చూశాను. మంచి యాక్టర్‌. తను సినిమా రంగంలోకి రావడం ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన సినిమా చంటబ్బాయ్‌. ఆ జానర్‌లో ఈ సినిమా రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘సినిమా హీరో కావాలనే నా కల నెరవేరింది.

రెండున్నరేళ్లు మేం కష్టపడి చేసిన హిలేరియస్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఇది. మా సినిమా ట్రైలర్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన సాయిధరమ్‌గారికి, నాతోనే ఈ సినిమా చేయాలని వెయిట్‌ చేసిన స్వరూప్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు నవీన్‌. ‘‘కొందరు మా సినిమా ‘చంటబ్బాయ్‌’లానే ఉంది అంటున్నారు. చిరంజీవిగారి ‘చంటబ్బాయ్‌’ ఓ క్లాసిక్‌. చిరంజీవి, జంధ్యాలగార్ల టైమింగ్‌ని మేం ఒక్క శాతం కూడా మ్యాచ్‌ చేయలేం’’ అన్నారు స్వరూప్‌. ‘‘ఇండస్ట్రీకి కొత్తవారిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను’’ అన్నారు రాహుల్‌ యాదవ్‌. దర్శకులు గౌతమ్‌ తిన్ననూరి, వెంకటేశ్‌ మహా పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top