పవన్‌ డైరెక్టర్‌తో సాయి ధరమ్‌...! | Sakshi
Sakshi News home page

పవన్‌ డైరెక్టర్‌తో సాయి ధరమ్‌...!

Published Sat, Jun 24 2017 12:24 PM

పవన్‌ డైరెక్టర్‌తో సాయి ధరమ్‌...!

డైరెక్టర్ కరుణాకరన్ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే సినిమా తొలిప్రేమ. పవన్ కళ్యాణ్ కెరీర్ ను  మలుపు తిప్పిన ఈ సినిమా, దర్శకుడిగా కరుణాకరన్ రేంజ్ ను కూడా పెంచింది. అయితే తొలి ప్రేమ తరువాత మరోసారి అంతటి భారీ విజయాన్ని నమోదు చేయటంలో ఫెయిల్ అవుతున్నాడు కరుణాకరన్. డార్లింగ్, ఉల్లాసంగా.. ఉత్సాహంగా లాంటి హిట్స్ ఉన్నా.. స్టార్ ఇమేజ్ తీసుకువచ్చే సినిమాలు మాత్రం ఇంత వరకు రాలేదు.

మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్న కరుణాకరన్, త్వరలో మరో మెగా హీరోతో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం బివియస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్, తరువాత చేయబోయే సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ వినాయక్ తో ఓ సినిమా చేయనున్నాడన్న వార్తలు వినిపిస్తుండగా.. కరుణాకరన్ తోనూ సినిమా అంగీకరించాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాను ముందు స్టార్ట్ చేస్తాడో తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement