పేరు మార్చుకున్న మెగా హీరో

Sai Dharam Tej Has Changed His Name To Sai Tej - Sakshi

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజను మందికి పైగా హీరోలు వెండితెర మీద సందడి చేస్తున్నారు. అయితే యంగ్‌ జనరేషన్‌లో రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌లు స్టార్‌ ఇమేజ్‌ సొంతం చేసుకోగా మిగతా హీరోలు సక్సెస్‌ల వేటలో ఉన్నారు. కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ కూడా తరువాత వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో పడ్డాడు. ప్రస్తుతం చిత్రలహరి సినిమాలో నటిస్తున్న సాయి సక్సెస్‌ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు.

వరస ఫ్లాప్‌లే కారణమో లేక మరే ఇతర కారణమైనా ఉందో తెలియదు గానీ సాయి ధరమ్‌ తేజ్‌ తన పేరును మార్చుకున్నాడు. ఇటీవల రిలీజ్‌ అయిన చిత్రలహరిలోని పరుగు పరుగు పాట లిరికల్‌ వీడియోలో సాయి ధరమ్‌ తేజ్‌ పేరును సాయి తేజ్‌ అని వేశారు. సినిమాలో కూడా టైటిల్స్‌లో ఇదే పేరు పడుతుందన్న టాక్‌ వినిపిస్తోంది. మరి ఈ కొత్త పేరైన సాయి ధరమ్‌ తేజ్‌ను ఫ్లాప్‌ల నుంచి బయటపడేస్తుందేమో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top