సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘చిత్రలహరి’

Sai Dharam Tej Chitralahari Censor Completed - Sakshi

వరుస ఫ్లాప్‌లతో ఇబ‍్బందుల్లో ఉన్న మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌, ట్రైలర్‌లు ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద పాజిటివ్ బజ్‌ క్రియేట్ అయ్యింది.

ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్లీన్‌ యు సర్టిఫికేట్ దక్కింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్‌ కొట్టాలని భావిస్తున్న సాయి ధరమ్‌ తేజ్‌ తన పేరును కూడా సాయి తేజ్‌ మార్చుకున్నాడు. మరి ఈ ప్రయోగం అయిన సాయి తేజ్‌కు హిట్‌ ఇస్తుందేమో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top