హమ్మయ్య.. రిలీజ్ డేట్ ఇచ్చేశారు | sahasam swasaga sagipo release date confirmed | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. రిలీజ్ డేట్ ఇచ్చేశారు

Oct 25 2016 10:25 AM | Updated on Sep 4 2017 6:17 PM

హమ్మయ్య.. రిలీజ్ డేట్ ఇచ్చేశారు

హమ్మయ్య.. రిలీజ్ డేట్ ఇచ్చేశారు

ప్రేమమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య స్పీడు పెంచాడు. చాలా కాలంగా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సాహసం శ్వాసగా సాగిపో సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్లో...

ప్రేమమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య స్పీడు పెంచాడు. చాలా కాలంగా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సాహసం శ్వాసగా సాగిపో సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నాడు. గతంలో రెండు మూడు సార్లు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటనలు వచ్చినా.. రిలీజ్ చేయలేకపోయారు. దీంతో ఆ సినిమాను పక్కన పెట్టేసి ప్రేమమ్ పూర్తి చేసి సూపర్ హిట్ కొట్టాడు.

ప్రస్తుతం ప్రేమమ్ సక్సెస్ను క్యాష్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు సాహసం శ్వాసగా సాగిపో టీం. క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నవంబర్ 11న రిలీజ్ అంటూ అఫీషియల్గా ప్రకటించేశారు. మరి ఈ సారైన నాగచైతన్య తన సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తాడో లేదో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement