సచిన్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా? | Sachin: A Billion Dreams Collection Day 1: Film opens at 8.40 crore at box-office | Sakshi
Sakshi News home page

సచిన్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా?

May 27 2017 3:36 PM | Updated on Sep 5 2017 12:09 PM

సచిన్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా?

సచిన్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా?

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్'.

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్'.  ఎలాంటి పబ్లిసిటీ, ప్రమోషన్స్ అవసరం లేకుండానే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలిరోజే ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. హిందీ, మరాఠి, తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఆడియన్స్ రియాక్షన్స్ ను పక్కనబెడితే బాక్సాఫీసు వద్ద ఈ సినిమా తన సత్తా చాటింది. తొలిరోజు కలెక్షన్ గా ఈ సినిమాకు బాక్సాఫీసు వద్ద రూ.8.40 కోట్ల వసూలు అయ్యాయి. సినిమా ఫార్మాట్ లో కాకుండా.. ఓ డాక్యుమెంటరీ తరహాలో సచిన్ జీవితాన్ని జేమ్స్ ఎర్స్ కిన్ తెరకెక్కించారు. కాగ అంతకమునుపే ఎంఎస్ ధోని, అజారుద్దీన్ బయోగ్రఫీలపై సినిమాలు వచ్చినప్పటికీ, వాటిల్లో బాలీవుడ్ నటులు ఆయా పాత్రల్లో నటించారు.
 
కానీ సచిన్ సినిమాల్లో సచినే నటించడం ఇటు క్రికెట్ ఫ్యాన్స్ ను, అటు సినిమా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. నేడు యూకేలో కూడా ఈ సినిమా విడుదలైంది. సినీ విమర్శకుల మన్ననలను సైతం ఈ సినిమా చూరగొంటోంది. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి వస్తున్న రివ్యూలు సైతం అద్భుతంగా ఉన్నాయి. ప్రఖ్యాత చలన చిత్ర విమర్శకుడు తరణ్ ఆదర్స్ సైతం ఈ మూవీ రివ్యూను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజలతో పంచుకున్నాడు. ''మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ను డెలివరీ చేశారు.. కాంగ్రాక్ట్స్ సచిన్ అండ్ టీమ్'' అంటూ అనుష్క శర్మ ట్వీట్ చేసింది. రియల్ లైఫ్ హీరో, సచిన్ సినిమా ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సహకరంగా ఉందంటూ ప్రముఖుల ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement