breaking news
box-office
-
సచిన్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా?
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్'. ఎలాంటి పబ్లిసిటీ, ప్రమోషన్స్ అవసరం లేకుండానే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలిరోజే ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. హిందీ, మరాఠి, తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఆడియన్స్ రియాక్షన్స్ ను పక్కనబెడితే బాక్సాఫీసు వద్ద ఈ సినిమా తన సత్తా చాటింది. తొలిరోజు కలెక్షన్ గా ఈ సినిమాకు బాక్సాఫీసు వద్ద రూ.8.40 కోట్ల వసూలు అయ్యాయి. సినిమా ఫార్మాట్ లో కాకుండా.. ఓ డాక్యుమెంటరీ తరహాలో సచిన్ జీవితాన్ని జేమ్స్ ఎర్స్ కిన్ తెరకెక్కించారు. కాగ అంతకమునుపే ఎంఎస్ ధోని, అజారుద్దీన్ బయోగ్రఫీలపై సినిమాలు వచ్చినప్పటికీ, వాటిల్లో బాలీవుడ్ నటులు ఆయా పాత్రల్లో నటించారు. కానీ సచిన్ సినిమాల్లో సచినే నటించడం ఇటు క్రికెట్ ఫ్యాన్స్ ను, అటు సినిమా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. నేడు యూకేలో కూడా ఈ సినిమా విడుదలైంది. సినీ విమర్శకుల మన్ననలను సైతం ఈ సినిమా చూరగొంటోంది. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి వస్తున్న రివ్యూలు సైతం అద్భుతంగా ఉన్నాయి. ప్రఖ్యాత చలన చిత్ర విమర్శకుడు తరణ్ ఆదర్స్ సైతం ఈ మూవీ రివ్యూను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజలతో పంచుకున్నాడు. ''మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ను డెలివరీ చేశారు.. కాంగ్రాక్ట్స్ సచిన్ అండ్ టీమ్'' అంటూ అనుష్క శర్మ ట్వీట్ చేసింది. రియల్ లైఫ్ హీరో, సచిన్ సినిమా ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సహకరంగా ఉందంటూ ప్రముఖుల ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. -
మూడు రోజుల్లో 30 కోట్లు
మూడు రోజుల్లో రూ.30 కోట్లు వసూలు చేసి అసాధారణ రికార్డును అంజాన్ చిత్రం సాధించిందని చిత్ర యూనిట్ పేర్కొంది. సూర్య, సమంత జంటగా నటించిన చిత్రం అంజాన్. లింగుసామి దర్శకత్వంలో తిరుపతి బ్రదర్స్, యూటీవీ మోషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. తమిళనాడు, కేరళ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఏక కాలంలో అత్యధిక థియేటర్లలో విడుదలైన అంజాన్ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, వసూళ్లను మాత్రం రికార్డు స్థాయి సాధించడం విశేషం. ఈ చిత్రం మూడు రోజుల్లోనే 30 కోట్లు వసూలు చేసిందని యూనిట్ వర్గాలు వెల్లడించారుు. తమిళం, మలయాళం భాషల్లో ఇంతకు ముందు ఏ చిత్రం సాధించనంత రికార్డు స్థాయి వసూళ్లతో అంజాన్ చరిత్ర తిరగ రాస్తుందని చిత్ర యూనిట్ పేర్కొన్నారు. ఆరు నిమిషాల నిడివి తగ్గింపు పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందిన అంజాన్ చిత్రంలోని ఆరు నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు తెలిసింది. చిత్ర రెండో భాగంలో నిడివి ఎక్కువయ్యిందనే విమర్శలు రావడంతో ఆ ఆరు నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు యూటీవీ మోషన్స్ సంస్థ ప్రతినిధి ధనుంజయన్ వెల్లడించారు. చిత్రంలో హాస్య నటుడు బ్రహ్మానందం హాస్య సన్నివేశాలున్నాయన్నారు. అవి కథకు సంబంధం లేకపోవడంతో తొలగించినట్లు ఆయన వివరించారు. అయితే తెలుగు వెర్షన్లో ఈ సన్నివేశాలు యథాతథంగా ఉంటాయని తెలిపారు.